Cinema: ఈటీవీ విన్ లో 'పంచతంత్రం'
ఐదు కథల మేళవింపు పంచతంత్రం; డిజిటల్ స్ట్రీమింగ్ రిలీజ్ డేట్....;
పంచభూతాల నేపథ్యంలో హృదయానికి హత్తుకునే ఐదు కథల మేళవింపుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆంథాలజీ పంచతంత్రం. పాత, కొత్త తరం నటీనటులతో తెరకెక్కించిన ఈ సినిమాల ో థియోటర్లలో రిలీజ్ అయ్యి మంచి స్పందన రాబట్టుకుంది. తాజాగా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. మార్చ్ 22న ఈటీవీ విన్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవ్వబోతోంది. హర్ష పులిపాక దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఆంథాలజీలో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యంగ్ హీరో రాహుల్ విజయ్, దివ్య శ్రీపాద, ‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య, శ్రీవిద్య ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. ది వీకెండ్ షో సమర్పణలో టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్‌పై అఖిలేష్ వర్ధన్, స్రుజన్ ఎరబోలు ఈ అంథాలజీని నిర్మించిన సంగతి తెలిసిందే. మరి థియేటర్లలో ప్రేక్షకుల ఆదరణ చూరగొన్న పంచతంత్ర నెటిజెన్లను ఏ విధంగా అలరిస్తుందో చూడాలి.