Cinema: యూట్యూబ్ ను షేక్ చేస్తోన్న అనౌన్స్మెంట్ వీడియో
వీఎన్ఆర్ టీమ్ సెటైరికల్ వీడియోకు నెటిజెన్లు ఫిదా;
భీష్మ సక్సెస్ ను రిపీట్ చేసేందుకు బరిలోకి దిగిన వీఎన్ఆర్ టీమ్ అనౌన్స్మెంట్ వీడియోతోనే ఢంకా భజాయించేస్తోంది. కొత్త పబ్లిసిటీస్ట్రాటజీని పరిచయం చేస్తూ వీఎన్ఆర్ టీమ్ విడుదల చేసిన వీడియో యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. కాస్త సెటైరిక్ గా సాగిన ఈ వీడియోకు లైకు మీద లైకులు వచ్చి పడుతున్నాయి. ముఖ్యంగా రష్మిక, నితిన్ గెటప్, యాక్టింగ్ కు ఎక్కువ మార్కులు పడ్డాయి. మొత్తాని ఈ సెటైరికల్ వీడియో 10 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. మరి అనౌన్స్మెంట్ తోనే ఈ రేంజ్ లో హడావిడి చేస్తున్న భీష్మ ఇకపై ఇంకెన్ని ఝలక్ లు వదులుతుందో చూడాలి.