Cinema: గల్లా బాబు పుట్టినరోజు కానుక
పక్కా కమర్షియల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న చిత్రం;
సుపర స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా రెండవ సినిమాతో బాక్సాఫీస్ వద్ద గట్టిగానే ఢంకా భజాయించేందుకు సిద్ధమవుతున్నాడు. లలితాంబికా ప్రొడక్షన్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న కమర్షియల్ యాక్షన్ డ్రామాలో మాస్ హీరోగా కనిపించబోతున్నాడు. అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ కథ అందించడం విశేషం. డైలాగులు డా. సాయి మాధవ్ బుర్రా అందించగా, భీమ్స్ సెసీరెలో స్వరాలు సమకూర్చుతున్నారు. నల్లప్పనేని యామిని, సోమినేని బాలకృష్ణ ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించబోతున్నారు. ఇక అశోక్ పుట్టిన రోజు పురస్కరించుకుని విడుదలైన యాక్షన్ ఫస్ట్ లుక్ లో అబ్బాయి మాస్ లుక్స్ లో ఇరగదీశాడనే చెప్పాలి. మరి ఇదే ఊపులో అశోక్ మామకు తగ్గ అల్లుడు అనిపించుకుంటాడేమో చూడాలి.