పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్..!
సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని జనసేన.. సోషల్ మీడియా వెల్లడించింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్ ఉన్నారు.;
సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని జనసేన.. సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం పవన్.. హోం ఐసోలేషన్ ఉన్నారు. ఈ మధ్యే పవన్.. సెక్యురిటీలో కొందరికి కరోనా వచ్చింది. దీనితో హోం క్వారంటన్ లోకి వెళ్ళిపోయిన పవన్.. తాజాగా కరోనా టెస్టులు చేయించుకున్నారు. అందులో ఆయనకి కరోనా అని తేలింది. పవన్ కి కరోనా అని తెలియడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పవన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. వకీల్ సాబ్ సినిమాతో ఈ మధ్యే రీఎంట్రీ ఇచ్చారు పవన్. ప్రస్తుతం ఈ చిత్రం భారీ వసూళ్ళతో దూసుకుపోతుంది.