Dhanush : గొప్ప మనసు చాటుకున్న ధనుష్..
Dhanush : కోలీవడ్ స్టార్ ధనుష్ గొప్ప మనసు చాటుకున్నారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న తోటి ఆర్టిస్ట్‌కు అండగా నిలిచారు;
Dhanush : కోలీవడ్ స్టార్ ధనుష్ గొప్ప మనసు చాటుకున్నారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న తోటి ఆర్టిస్ట్‌కు అండగా నిలిచారు. కోలీవుడ్ కమెడియన్ బోండా మణి గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. రెండు కిడ్నీలు పాడవడంతో చెన్నై ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ధనుష్.. లక్ష రూపాయల సాయాన్ని అందించారు. బోండా మణి కృతఘ్నతలు తెలుపుతూ వీడియో రిలీజ్ చేశారు. గతంలో ధనుష్‌లా విజయసేతుపతి కూడా ఇటాంటి సాయం ఎన్నో సార్లు చేశారు. ధనుష్ ప్రస్తుతం అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న కెప్టెన్ మిల్లర్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.