Dil Raju: నెలల తరబడి షూటింగ్ ఆపాలనే ఉద్దేశం లేదు: దిల్ రాజు
Dil Raju: చిత్ర పరిశ్రమకు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్సే సుప్రీం అన్నారు దిల్ రాజు.;
Dil Raju: చిత్ర పరిశ్రమకు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్సే సుప్రీం అన్నారు దిల్ రాజు. తెలుగు ఫిలిం ఛాంబర్ మాత్రమే డెసిషన్ మేకర్ అన్నారాయన. తమలో ఎలాంటి గొడవలు లేవని.. ఇక నుంచి ఏ అప్డేట్ అయిన ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ద్వారానే వస్తుందన్నారు. ప్రస్తుతం అన్ని సినిమాల షూటింగ్‌లు ఆగిపోయాయన్నారు. త్వరలో సమస్యలను పరిష్కరించి, షూటింగ్‌లు మొదలు పెడతామన్నారు దిల్ రాజు.
ఇవాళ తెలుగు ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో నాలుగు అంశాలపై చర్చించినట్లు తెలిపారు నిర్మాత దిల్ రాజు. ఓటీటీకి ఎన్ని వారాలకు వెళ్తే పరిశ్రమకు మంచిదనే అంశంపై కమిటీ వేశామన్నారు. థియోటర్లలో వీపీఎఫ్ ఛార్జీలు పర్సెంటేజ్‌లు ఎలా ఉండాలనేదానిపై మరో కమిటీ వేశామన్నారు. ఈ కమిటీ ఎగ్జిబిటర్లతో మాట్లాడుతుందని తెలిపారు. ఇక ఫెడరేషన్ వేజెస్, పనిచేసే పరిస్థితులపైనా కమిటీ వేసినట్లు తెలిపారు.
నిర్మాతలకు ప్రొడక్షన్‌లో వేజెస్, వర్కింగ్ కండిషన్లు, ఎన్ని గంటలు షూటింగ్ చేయాలన్నదానిపై మరో కమిటీ వేసినట్లు తెలిపారు. ఈ నాలుగు అంశాలపై చాంబర్ ఆధ్వర్యంలో కమిటీ వేసినట్లు తెలిపారు. నిర్మాతల సమస్యల పరిష్కారానికి ఇది నాంది అన్నారు నిర్మాతల మండలి అధ్యక్షులు సి. కల్యాణ్. ఫిలిం ఇండస్ట్రీ సమస్యలు అతి త్వరలో పరిష్కారమవుతాయని తెలిపారాయన. తెలుగు ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో చిత్ర పరిశ్రమకు పునర్వైభవం రాబోతోందని తెలిపారు