Anasuya Bharadwaj: అనసూయ డ్రెస్సింగ్‌పై దర్శకుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Anasuya Bharadwaj: ఎప్పుడూ తన డ్రెస్సింగ్ స్టైల్ వల్లే అనసూయ ఎక్కువగా ట్రోల్ అవుతూ ఉంటుంది.

Update: 2022-06-21 15:10 GMT

Anasuya Bharadwaj: టాలీవుడ్‌లోని బుల్లితెర యాంకర్లలో అనసూయ భరద్వాజ్‌కు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. పెళ్లయినా కూడా ఇంకా బుల్లితెరపై తన యాంకరింగ్‌తో అదరగొడుతూ.. వెండితెరపై కూడా తానేంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది అనసూయ. కాగా అనసూయ డ్రెస్సింగ్ స్టైల్‌పై ఇప్పటివరకు చాలామంది చాలా రకాలుగా కామెంట్లు చేయగా.. తాజాగా ఓ దర్శకుడు కూడా ఈ విషయంపై తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.


తెలుగులోని అలనాటి పాపులర్ దర్శకులలో గీతాకృష్ణ ఒకరు. ఆయన తెరకెక్కించిన సినిమాలు కమర్షియల్‌గా సక్సెస్ అవ్వకపోవడంతో చాలాకాలంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్నాడు ఈ దర్శకుడు. తాజాగా క్యాస్టింగ్ కౌచ్‌పై చేసిన సెన్సేషనల్ కామెంట్స్‌తో మళ్లీ ఈయన వెలుగులోకి వచ్చారు. ఇక తాజాగా అనసూయ డ్రెస్సింగ్ స్టైల్‌పై కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు గీతాకృష్ణ.


'రంగస్థలం' సినిమాలో రంగమ్మత్త పాత్రలో అనసూయ చాలా అద్భుతంగా నటించింది అన్నారు గీతాకృష్ణ. పుష్ప సినిమాలో అయితే అనసూయను గుర్తుపట్టలేకపోయానని అన్నారు. అనసూయ ఎంతో అద్భుతంగా నటిస్తుందని, ఆమె నటనను చూసి కొందరు అసూయ పడుతూ ఆమెను ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటారని అనసూయకు సపోర్ట్ చేశారు గీతాకృష్ణ.

ఎప్పుడూ తన డ్రెస్సింగ్ స్టైల్ వల్లే అనసూయ ఎక్కువగా ట్రోల్ అవుతూ ఉంటుంది. అయితే గీతాకృష్ణకు మాత్రం అనసూయ డ్రెస్సింగ్ స్టైల్ చాలా ఇష్టమట. అయితే ఓ దర్శకుడు.. అనసూయ డ్రెస్సింగ్ స్టైల్‌పై కామెంట్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. గీతాకృష్ణ మాత్రమే కాదు.. చాలామంది నెటిజన్లు కూడా అనసూయ డ్రెస్సింగ్ స్టైల్‌ను సపోర్ట్ చేస్తూ ఉంటారు.

Tags:    

Similar News