'ఆచార్య'కు మంత్రి నివాసంలో బస!
ఖమ్మం జిల్లాలో మంత్రిని కలిసి గనుల్లో సినిమా షూటింగ్ కోసం అనుమతి ఇవ్వాలని కొరటాల విజ్ఞప్తి చేశారు.;
టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ ఆచార్య చిత్రం కోసం తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ ని కలిశారు. ఖమ్మం జిల్లాలో మంత్రిని కలిసి గనుల్లో సినిమా షూటింగ్ కోసం అనుమతి ఇవ్వాలని కొరటాల విజ్ఞప్తి చేశారు. అయితే దీనిపట్ల మంత్రి సానుకూలంగా స్పందించినట్టుగా తెలిసింది.
అయితే షూటింగ్ జరిగినన్ని రోజులు చిరంజీవి తన నివాసంలో ఉండాలని మంత్రి కోరారు. దీనితో చిరు షూటింగ్ అయిపోయేవరకు మంత్రి నివాసంలో బస చేయనున్నారు. మార్చి 7 నుంచి 15వ తేదీ వరకు ఖమ్మం జిల్లాలోని ఇల్లందులో ఆచార్య సినిమా షూటింగ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు.
ఇక్కడ చిరు పైన, రామ్ చరణ్ పైన కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. కాగా కొన్నిరోజుల క్రితం ఆచార్య షూటింగ్‌లోనే చిరంజీవిని, కొరటాల శివను మంత్రి పువ్వాడ కలిసిన సంగతి తెలిసిందే.