Aditi : సినిమాల్లోకి స్టార్ డైరెక్టర్ కూతురు..!
సూర్య తమ్ముడు కార్తి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'విరుమన్'. ఈ సినిమాకి డైరెక్టర్ ముత్తయ్య దర్శకత్వం వహిస్తున్నారు.;
సినీ స్టార్ హీరోల,దర్శకుల వారుసలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం అనేది సహజమే.. అందులో భాగంగానే సౌత్‌లో టాప్ దర్శకుడిగా కొనసాగుతున్న శంకర్ చిన్న కూతురు అదితి శంకర్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. అమెకి స్టార్ హీరో సూర్య స్వాగతం పలుకుతూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. సూర్య తమ్ముడు కార్తి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'విరుమన్'. ఈ సినిమాకి ముత్తయ్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై హీరో సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఈ సినిమాతోనే అదితి శంకర్ హీరోయిన్‌గా పరిచయం అవుతుంది. ఈ సందర్భంగా ఆమెకి గ్రాండ్ వెల్‌కమ్ చెబుతూ ఓ పోస్టర్‌ని రిలీజ్ చేశారు సూర్య. ఇందులో సాంప్రదాయ దుస్తుల్లో కనిపించిన అదితి అందరినీ అట్రాక్ట్ చేసింది. అటు తన కూతురిని హీరోయిన్‌గా పరిచయం చేస్తున్న సూర్య, కార్తీ, జ్యోతికలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు డైరెక్టర్ శంకర్. 2022లో సినిమా విడుదలయ్యే ఛాన్స్ ఉంది.