Naga Chaitanya Samantha Divorce : విడాకుల విషయంలో సమంతకు ఎంత వస్తుందన్నదానిపై చర్చ
Naga Chaitanya Samantha Divorce : నాగచైతన్య, సమంత విడాకులు అనేసరికీ టాలీవుడ్ తో పాటు తెలుగు సినీ ప్రేక్షకులు కూడా చాలా బాధపడుతున్నారు. చాలా ముచ్చటైన జంట.. కళ్లముందు చాలా సంతోషంగా తిరిగేది.. అక్కినేని వారింట ఎంత సందడి చేసేదో అనుకున్నారు.;
Naga Chaitanya Samantha Divorce : నాగచైతన్య, సమంత విడాకులు అనేసరికీ టాలీవుడ్ తో పాటు తెలుగు సినీ ప్రేక్షకులు కూడా చాలా బాధపడుతున్నారు. చాలా ముచ్చటైన జంట.. కళ్లముందు చాలా సంతోషంగా తిరిగేది.. అక్కినేని వారింట ఎంత సందడి చేసేదో అనుకున్నారు. అనుకున్నట్టుగానే టాలీవుడ్ బెస్ట్ కపుల్ గా ఎప్పుడూ చూసేవారు. కానీ ఇప్పుడు విడాకులు తీసుకుంటున్నాం అని ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించేసరికీ అందరిలోనూ అంతులేని ఆవేదన కలిగింది.
సమంత, నాగచైతన్యల విడాకుల విషయం ఎంతగా చర్చకొచ్చిందో.. అసలెందుకు విడాకులు తీసుకుంటున్నారు అన్న విషయంపైనా డిస్కషన్ నడిచింది. దీంతోపాటే విడాకులు తీసుకుంటున్నందుకు గాను.. సమంతకు దాదాపు 200 కోట్ల రూపాయిలు అక్కినేని కుటుంబం ఇస్తోందన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. నిజానికి ఇదంతా నిజమా కాదా అన్నది ఎవరికీ తెలియదు. కాకపోతే హాట్ టాపిక్ గా మారింది.
అయినా నాగచైతన్యకు, సమంతకు ఇది చాలా కష్టసమయం. ఇలాంటప్పుడు వారికి మనోధైర్యాన్నిచ్చేలా ఎవరి ప్రవర్తనైనా ఉండాలి. కానీ ఇప్పుడు ఇలాంటి సున్నితమైన అంశంపై చర్చ జరుగుతుండడం అక్కినేని అభిమానులను బాధిస్తోంది. అయినా ఇద్దరూ విడిపోవాలని ఒక్కటిగానే అనుకున్నారు. తండ్రిగా, మామగా నాగార్జున కూడా వారి భవిష్యత్తు బాగుండాలనే కోరుకున్నారు. సో... ఇలాంటప్పుడు విడాకులు తీసుకుంటున్నందుకు గాను ఫలానా మొత్తం సమంతకు వస్తుందన్న టాపిక్ అనవసరం.