Entertainment: రాపర్ గా మారిన హ్యాండ్సమ్ హీరో

రాప్ ఆల్బమ్ తో దూసుకువస్తోన్న త్రిగుణ్; లాలాల్యాండ్ లో అదిరిపోయే పర్ఫార్మెన్స్;

Update: 2023-03-07 12:02 GMT
హీరోగా తనకంటూ ఓ విలక్షణమైన ఇమేజ్ ను సంపాదించుకున్న త్రిగుణ్ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. తనలోని సరికొత్త ప్రతిభను వెలికి తీసిన ఈ హ్యాండ్సమ్ హీరో రాపర్ గా ఆరంగేట్రం చేశాడు. స్వయంగా తానే రాసుకున్న లిరిక్స్ తో అదిరిపోయే రాప్ సాంగ్ ను కంపోజ్ చేసిన త్రిగుణ్ ఇటీవలే లాలాల్యాండ్ లో పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చాడు. సంగీత ప్రియులను ఉర్రూతలూగించేశాడు. అసుర ఈ సాంగ్ కు సంగీతం అందించగా రిక్కీ బీ, ప్రియాంకా గజానన్ కూడా వోకల్స్ అందించారు. త్వరలోనే వీడియో ఆల్బమ్ రూపంలోనూ అన్ని సంగీత ప్లాట్ ఫార్మ్స్ లో ఈ పాట అందుబాటులోకి రానుంది. మరి హీరోగా తనదైన మార్క్ వేసిన త్రిగుణ్, మ్యూజిక్ తోనూ మైమరపిస్తాడేమో చూాడాలి. 
Tags:    

Similar News