Samantha Ruth Prabhu : క్లోజ్‌ఫ్రెండ్‌తో సామ్ డెహ్రాడూన్ టూర్..!
Samantha Ruth Prabhu : అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత సామ్ మళ్ళీ సినిమాల పైన ఫోకస్ పెట్టింది. ఇప్పటికే శాకుంతలం సినిమాని ఫినిష్ చేసిన ఆమె.. తమిళలో ఓ సినిమాని చేస్తోంది.;
Samantha Ruth Prabhu : అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత సామ్ మళ్ళీ సినిమాల పైన ఫోకస్ పెట్టింది. ఇప్పటికే శాకుంతలం సినిమాని ఫినిష్ చేసిన ఆమె.. తమిళలో ఓ సినిమాని చేస్తోంది. తాజాగా దసరా కానుకగా బై లాంగ్వేజ్ సినిమా చేస్తున్నట్టుగా వెల్లడించింది.
ఈ సినిమా త్వరలోనే మొదలుకానుంది. అయితే షూటింగ్ కి కాస్త గ్యాప్ దొరకడంతో దొరికిన ఈ సమయాన్ని అన్నివిధాలుగా సద్వినియోగం చేసుకుంటుంది ఆమె.. తనకెంతో ఇష్టమైన వారితో సమయాన్ని గడుపుతోంది.
తనకెంతో ఆప్తురాలైన శిల్పారెడ్డిని తాజాగా కలిశారు. ఆమె కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. మంగళవారం సాయంత్రం సామ్-శిల్పా విహారయాత్ర కోసం డెహ్రాడూన్ కి వెళ్లారు.
అక్కడ సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వీరిద్దరూ షేర్ చేయగా అవి వైరల్ గా మారుతోన్నాయి.