పొలం దున్నుతున్న టాప్ హీరోయిన్.. వీడియో వైరల్..!
అతి తక్కువ టైంలో టాప్ హీరోయిన్స్‌ల లిస్టులో చేరింది నటి రష్మిక మందన్నా.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.;
అతి తక్కువ టైంలో టాప్ హీరోయిన్స్‌ల లిస్టులో చేరింది నటి రష్మిక మందన్నా.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగు,కన్నడ భాషా చిత్రాల్లో సత్తా చాటుతున్న ఈ భామ... ఇప్పుడిప్పుడే హిందీ, తమిళ బాషల్లో అవకాశాలను దక్కించుకుంటుంది. ప్రస్తుతం తమిళంలో కార్తీ హీరోగా వస్తున్న 'సుల్తాన్' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో పక్కా పల్లెటూరి యువతి పాత్రను పోషిస్తుంది రష్మిక.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియోని రష్మిక తన ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. ఈ వీడియోలో రష్మిక.. పొలం దున్నుతున్నట్టుగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై యస్.ఆర్. ప్రకాష్ బాబు, యస్.ఆర్. ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.