GodFather: బాస్ వచ్చేశారు..! గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ రిలీజ్..
GodFather: మోహన్‌లాల్ నటించిన సూపర్ హిట్ మలయాళ చిత్రం ‘లూసిఫర్’ చిత్రానికి రీమేక్‌గా వస్తుంది గాడ్ ఫాదర్.;
GodFather: సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి స్పీడ్ చూసి ఇతర హీరోలు ఆశ్చర్యపోతున్నారు. వరుసగా స్క్రిప్ట్స్‌ను ఓకే చేయడమే కాదు.. షూటింగ్స్‌లో కూడా బ్రేక్ లేకుండా పాల్గొని మూడు నెలలకు ఒక సినిమా విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నారు. ఇక ఆయన సినిమాల్లో ముందుగా వచ్చే 'గాడ్ ఫాదర్' చిత్రం నుండి ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఈ ఫస్ట్ లుక్‌లో చిరంజీవి లుక్స్ చాలా స్టైలిష్‌గా ఉన్నాయి.
మోహన్‌లాల్ నటించిన సూపర్ హిట్ మలయాళ చిత్రం 'లూసిఫర్' చిత్రానికి రీమేక్‌గా వస్తుంది గాడ్ ఫాదర్. ఈ సినిమాను తెలుగులో మోహన్ రాజా డైరెక్ట్ చేస్తుండగా.. సునీల్, సత్యదేవ్, నయనతార ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో అప్డేట్స్ ఇవ్వడంతో స్పీడ్ పెంచాలనుకుంటోంది మూవీ టీమ్.
గాడ్ ఫాదర్ మూవీ ఫస్ట్ లుక్‌తో పాటు విడుదలపై కూడా క్లారిటీ ఇచ్చింది మూవీ టీమ్. ఈ దసరాకు గాడ్ ఫాదర్ థియేటర్లలో సందడి చేయనుందని క్లారిటీ ఇచ్చేశారు. ఇక ఈ ఫస్ట్ లుక్‌లో సునీల్ కారు డోర్ ఓపెన్ చేయగా.. అందులో నుండి చిరంజీవి స్టైలిష్ ఎంట్రీ అదిరిపోయింది. ఆ తర్వాత ఆయన వాకింగ్ స్టైల్‌తో మరోసారి ప్రేక్షకులను చూపు తిప్పుకోనివ్వలేదు చిరు.