Pawan Kalyan :హరిహర వీరమల్లు.. టీజర్ వచ్చేది అప్పుడే...!

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'హరిహర వీరమల్లు ' ... పిరియాడికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది.

Update: 2021-05-24 16:15 GMT

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'హరిహర వీరమల్లు ' ... పిరియాడికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఏం రత్నం భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2న విడుదల చేసే ఆలోచనలో చిత్రబృందం ఉందట. అంతేకాకుండా నిధి అగర్వాల్ కు సంబంధించి ఫస్ట్ లుక్ ను ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 17న రిలీజ్ చేయనున్నారట.. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ మాత్రమే రిలీజ్ అయింది. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

Tags:    

Similar News