Ramya Krishna Remunaration: 'లైగర్'లో తల్లి పాత్ర కోసం రమ్యకృష్ణ రెమ్యునరేషన్ ఎంతంటే..?
Ramya Krishna Remunaration: ‘లైగర్’ కోసం ఒక్కొక్కరు అందుకున్న రెమ్యునరేషన్ కూడా ఇప్పటికీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా ఉంది;
Ramya Krishna Remunaration: రౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరీర్‌లో మొదటి పాన్ ఇండియా చిత్రం 'లైగర్'. ఈ సినిమాపై విజయ్‌కు మాత్రమే కాదు పూరీ జగన్నాధ్‌కు కూడా చాలా అంచనాలే ఉన్నాయి. కానీ ఆ అంచనాలన్నీ తారుమారయ్యేలా మూవీపై మార్నింగ్ షో నుండే నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ సినిమాను చూడాలనుకున్న చాలామంది వెనక్కి తగ్గారు. లైగర్ ఎలా ఉన్నా.. అందులో రమ్యకృష్ణ, విజయ్ క్యారెక్టర్లకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.
సీనియర్ నటి రమ్యకృష్ణ.. తల్లి పాత్రలు చేయడం మొదలుపెట్టిన తర్వాత కూడా తన క్రేజ్ అలాగే కొనసాగుతూ వచ్చింది. ఇక బాహుబలిలో రమ్యకృష్ణ చేసిన శివగామి పాత్ర తను తప్ప ఇంకెవరూ చేయలేరేమో అనిపించేలా ఉంది. అలాంటి మరో పవర్‌ఫుల్ తల్లి పాత్రే లైగర్‌లో కూడా కనిపించింది. కొడుకును బాక్సర్ చేయాలనుకొని ప్రపంచానికి ధైర్యంగా నిలబడే తల్లి పాత్రలో రమ్యకృష్ణ ఒదిగిపోయింది అనడంలో ఆశ్చర్యం లేదు.
'లైగర్' సినిమా కోసం ఒక్కొక్కరు అందుకున్న రెమ్యునరేషన్ కూడా ఇప్పటికీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా ఉంది. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ రూ. 35కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం. మైక్ టైసన్ రెమ్యునరేషన్ రూ. 40 కోట్లని టాక్ వినిపిస్తోంది. ఇక వీరితో పాటు రమ్యకృష్ణ.. లైగర్ కోసం రూ.1 కోటిని పారితోషికంగా అందుకుందట. బడ్జెట్, రెమ్యునరేషన్.. ఇలా అన్ని విషయాల్లో హై స్టాండర్డ్ మెయింటేయిన్ చేసిన లైగర్.. ప్రేక్షకులను మెప్పించే విషయంలో మాత్రం వెనకబడింది.