Manchu Vishnu on Pawan : పవన్ ప్రశ్నలకు మా నాన్నే సమాధానం చెప్తారు... ఆయన కామెంట్లతో ఏకీభవించడం లేదు..!

Manchu Vishnu on Pawan : సినిమా టికెట్ల ఆన్‌లైన్‌ అమ్మకాలపై పవన్ కల్యాణ్‌ కామెంట్లతో తాను ఏకీభవించడం లేదని స్పష్టం చేశారు మంచు విష్ణు.

Update: 2021-09-28 09:28 GMT

Manchu Vishnu on Pawan : సినిమా టికెట్ల ఆన్‌లైన్‌ అమ్మకాలపై పవన్ కల్యాణ్‌ కామెంట్లతో తాను ఏకీభవించడం లేదని స్పష్టం చేశారు మంచు విష్ణు. పవన్‌ వ్యాఖ్యలపై మోహన్‌బాబే సమాధానం ఇస్తానన్నారు. అసలు మా ఎన్నికల్లోకి రాజకీయ పార్టీలు రావొద్దని కోరుతున్నానన్నారు మంచు విష్ణు. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌లో ఉన్న 900 మంది సభ్యుల మద్దతు తనకే ఉందన్న మంచు విష్ణు.. రేపు లేదా ఎల్లుండి మేనిఫెస్టో ప్రకటిస్తానని చెప్పుకొచ్చారు. తమ ప్యానల్ మేనిఫెస్టో చూశాక చిరంజీవి, పవన్ కూడా తమకే ఓటు వేస్తారన్నారు. మా ఎన్నికలు ప్రతి తెలుగు నటుడి ఆత్మగౌరవ పోరాటంగా అభివర్ణించారు మంచు విష్ణు.

మా అధ్యక్ష పదవికి నామినేషన్‌ వేశారు మంచు విష్ణు. ఫిలింనగర్‌లోని మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఆఫీస్‌కు భారీ ర్యాలీగా వెళ్లారు. ఫిలించాంబర్‌లోకి వెళ్తున్న సమయంలో బాణసంచా కాల్చి స్వాగతం పలికారు మంచు అభిమానులు. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మంచు విష్ణు.. కొన్ని రోజుల క్రితమే ప్యానెల్‌ను ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌, మంచు విష్ణు ప్యానెల్‌కు మధ్య తీవ్ర పోటీ నడుస్తోంది.

Tags:    

Similar News