Hero Nikhil : మెడికల్ ఎమర్జెన్సీ అని చెప్పినా వదల్లేదు : హీరో నిఖిల్
Hero Nikhil Siddharth : కరోనా కట్టడికి తెలంగాణా ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ని పోలీసులు కూడా చాలా కఠినంగా అమలు చేస్తున్నారు.;
Hero Nikhil Siddharth : కరోనా కట్టడికి తెలంగాణా ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ని పోలీసులు కూడా చాలా కఠినంగా అమలు చేస్తున్నారు. సరైన కారణం లేకుండా ఎవరైనా రోడ్లపైకి వస్తే వారి వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో అవసరమైన సేవలకి కూడా అనుమతి ఇవ్వడం లేదు.. తాజాగా కొవిడ్ రోగికి మందులివ్వడానికి వెళ్తున్న టాలీవుడ్ నటుడు నిఖిల్‌ను పోలీసులు ఆపివేశారు. ఈ విషయాన్ని చెబుతూ నిఖిల్ ట్వీట్ చేశాడు. ఈ-పాస్ కోసం 9 సార్లు ప్రయత్నించినా సర్వర్ డౌన్ కావడంతో స్ దొరకలేదని, మెడికల్ ఎమర్జెన్సీ అని చెబితే అనుమతిస్తారని భావించి వచ్చినట్లు పేర్కొన్నాడు. అయితే దీనిపై హైదరాబాద్ సిటీ పోలీసు విభాగం స్పందించింది. 'డియర్ సర్, మీ లొకేషన్ ఒక్కసారి మాకు పంపించండి. స్థానిక అధికారులతో మాట్లాడి మీ సమస్యను తీరుస్తాం'అని రిప్లై ఇచ్చింది.