NTR Surprise From RRR : రేపు ఉదయం 10 గంటలకి...!

NTR Surprise From RRR : జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ 'RRR' నుంచి రేపు ఓ సర్‌ప్రైజ్ రానుంది.

Update: 2021-05-19 11:30 GMT

NTR Surprise From RRR : జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ 'RRR' నుంచి రేపు ఓ సర్‌ప్రైజ్ రానుంది. రేపు జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు నేపథ్యంలో RRR నుంచి రావాల్సిన ట్రీట్ పై చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటన చేసింది. 'మీరు ఎప్పట్నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొమరం భీం గురించి రేపు 10 గంటలకు చెబుతాం. అభిమానులంతా ఇళ్లలోనే ఉండాలి. బయటకు వచ్చి పుట్టినరోజు వేడుకలు జరపవద్దు' అని RRR టీం ట్వీట్ చేసింది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా డివివి దానయ్య భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. 


Tags:    

Similar News