Rajasekhar On Maa Elections : 'మా' అధ్యక్షుడిగా పోటీ చేయాలనుకున్నా.. కానీ అందుకే డ్రాప్ అయ్యా : రాజశేఖర్‌

Rajasekhar On Maa Elections : మా' ఎన్నికలు ఇప్పుడు హాట్ టాపిక్‌‌‌గా మారాయి.. అధ్యక్ష్య పదవి కోసం పోటీ పడుతున్న మంచు విష్ణు, ప్రకాష్ రాజ్‌ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

Update: 2021-10-09 11:00 GMT

Rajasekhar On Maa Elections : మా' ఎన్నికలు ఇప్పుడు హాట్ టాపిక్‌‌‌గా మారాయి.. అధ్యక్ష్య పదవి కోసం పోటీ పడుతున్న మంచు విష్ణు, ప్రకాష్ రాజ్‌ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇద్దరు నువ్వా నేనా అంటూ ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇదిలావుండగా తనికి కూడా 'మా' అధ్యక్ష పదవికి పోటీ చేయాలని ఉందని తన మనసులోని మాటను బయట పెట్టారు రాజశేఖర్.

కరోనా నుంచి కోలుకొని మీడియాకి కాస్త దూరంగా ఉన్న రాజశేఖర్ మా ఎలక్షన్ల సందర్భంగా మైకు పట్టుకున్నారు. ప్రకాష్ రాజ్ ప్యానల్‌కు మద్ధతు తెలుపుతున్న ఆయన.. అధ్యక్ష పీఠం అనేది పెత్తనం చేయడానికి కాదని.. అది ఒక బాధ్యతతో కూడిన వ్యవహారమని అన్నారు. ప్రకాష్ గెలిస్తే అసోసియేషన్ అభివృద్ధి చెందుతుందని అన్నారు.

" మన తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది ధనవంతులు, గొప్ప నటీనటులు ఉన్నారు. పరిశ్రమ మరింత అభివృద్ధి చెందాలి. కీర్తి ప్రతిష్టలు సొంతం చేసుకోవాలి. అందుకు మంచి అధ్యక్షుడు కావాలి. అభివృద్ధి కోసం పాటు పడే వ్యక్తి ప్రకాష్ రాజ్ మాత్రమే. ఆయనే ఆ పదవికి పూర్తి న్యాయం చేయగలరు. ఓ రోజు మా ఇంటికి వచ్చి అసోసియేషన్ అభివృద్ధి కోసం తానేం చేయాలనుకుంటున్నాడో వివరించాడు. అది విన్న తర్వాత నా కంటే ప్రకాష్ రాజ్ అయితేనే అధ్యక్ష పదవికి పూర్తి న్యాయం చేయగలడనిపించింది.

ఎందుకంటే అసోసియేషన్ అభివృద్ధికి డబ్బులు కావాలి. అందుకోసం ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు నిర్వహించాలి. ఆయనకు వివిధ భాషలకు చెందిన ఇండస్ట్రీ వర్గాలతో మంచి సంబంధాలున్నాయి. కాబట్టి ఆయన ఫండ్ రైజింగ్ కోసం ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేయగలరు " అని అన్నారు. 

Tags:    

Similar News