ముగ్గురు స్టార్‌లతో పోటీ పడి మరి.. బ్లాక్‌బస్టర్ కొట్టిన శ్రీకాంత్..!
స్టార్ హీరోల మధ్య పోటీ అనేది ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటుంది. వారికి సంబంధించిన సినిమాలు ఒకే రోజున విడుదలైతే.. ఆ ఆసక్తి మరింత పీక్స్ లెవల్‌లో ఉంటుంది.;
స్టార్ హీరోల మధ్య పోటీ అనేది ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటుంది. వారికి సంబంధించిన సినిమాలు ఒకే రోజున విడుదలైతే.. ఆ ఆసక్తి మరింత పీక్స్ లెవల్‌లో ఉంటుంది. ఈ పోటీలో ఎవరు గెలుస్తారు? ఎవరి సినిమాకి ఎంతెంత కలెక్షన్లు వస్తాయో తెలుసుకోవాలనే ఆసక్తి కచ్చితంగా అభిమానుల్లో ఉంటుంది. అలాంటింది 1996లో ఓ సారి జరిగింది.. ముగ్గురు స్టార్ హీరోల మధ్య.. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఓ చిన్న సినిమా పెద్ద ప్రభంజనాన్ని సృష్టించింది.
1996 జనవరి 5 న బాలకృష్ణ హీరోగా వంశానికొక్కడు చిత్రం రిలిజైంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాకి శరత్ దర్శకత్వం వహించారు. ఆమని, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటించారు. ఇక అదే రోజున నాగార్జున హీరోగా వజ్రం సినిమా విడుదలైంది. మంచి హిట్స్‌తో స్వింగ్‌లో ఉన్న ఎస్పీ కృష్ణారెడ్డి దర్శకుడిగా, స్టార్‌గా పీక్స్ స్టేజిలో ఉన్న నాగార్జున హీరో కావడంతో సినిమా పైన అంచనాలు పెరిగాయి. వీరికి సరిగ్గా వారం తర్వాత వెంకటేష్ ధర్మచక్రం చిత్రం కూడా విడుదలైంది. బాషా సినిమాతో టాప్ డైరెక్టర్ లిస్టులో ఒకడిగా చేరిపోయిన సురేష్ కృష్ణ నుంచి వస్తున్న సినిమా రావడంతో ధర్మచక్రం పై కూడా భారీ అంచనాలుండేవి.
ఈ ఉత్కంఠ పోరులో నాగార్జున నటించిన వజ్రం ప్లాప్ అవ్వగా, వెంకటేష్ ధర్మచక్రం, బాలకృష్ణ వంశానికొక్కడు సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఇదే టైంలో వీరికి పోటీగా శ్రీకాంత్ హీరోగా వచ్చిన పెళ్ళిసందడి ఆ సంక్రాంతికి సూపర్ హిట్‌గా నిలిచి విన్నర్‌గా నిలిచింది. పెద్దగా స్టార్ ఇమేజ్ లేని శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ లతో దర్శకేంద్రుడు రాఘవేంద్రడు చేసిన మాయాజాలమే ఈ పెళ్ళిసందడి. జనవరి 12న విడుదలైన ఈ సినిమా స్లో టాక్‌తో మొదలై భారీ హిట్‌ని అందుకుంది. కేవలం కోటి రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 15 కోట్లను కొల్లగొట్టింది. కీరవాణి అందించిన పాటలు సినిమాకి మెయిన్ సోల్‌గా నిలిచాయి.