Vaishnav Tej Remuneration : రేటు పెంచేసిన ఉప్పెన హీరో.. మూడో సినిమాకే షాకింగ్ రెమ్యునరేషన్..!
Vaishnav Tej Remuneration : ఏ హీరోకైనా సరే.. మొదటి సినిమా అనేది చాలా ముఖ్యం.. మొదటి సినిమా హిట్ అయితేనే దర్శకులు, నిర్మాతలు అతడితో కలిసి పని చేసేందుకు ఎదురుచూస్తుంటారు.;
Vaishnav Tej
Vaishnav Tej Remuneration : ఏ హీరోకైనా సరే.. మొదటి సినిమా అనేది చాలా ముఖ్యం.. మొదటి సినిమా హిట్ అయితేనే దర్శకులు, నిర్మాతలు అతడితో కలిసి పని చేసేందుకు ఎదురుచూస్తుంటారు. లేకపోతే పక్కన పెట్టేస్తుంటారు. అయితే మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే మాంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన్ సినిమాతో వెండితెరకి పరిచయమయ్యాడు వైష్ణవ్ తేజ్.. ఈ సినిమా అతనికి స్పెషల్ క్రేజ్ ను తెచ్చిపెట్టింది. దీనితో ఈ మెగా హీరోకి మంచి డిమాండ్ ఏర్పడింది.
అయితే ఈ సినిమా సక్సెస్ తరవాత... వైష్ణవ్ తేజ్ భారీగానే రెమ్యునరేషన్ పెంచినట్టుగా తెలుస్తోంది. ఉప్పెన సినిమాకి గాను వైష్ణవ్ రూ.50 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నాడని, క్రిష్ డైరెక్షన్ లో చేస్తున్న తన రెండో సినిమాకి గాను రూ. 75 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నాడని సమాచారం.. ఇది కొంత ఆశ్చర్యంగానే ఉన్నప్పటికీ మూడో సినిమాకి గాను ఏకంగా రూ.2.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని ఫిలిం నగర్ లో జోరుగా ప్రచారం నడుస్తోంది. నిర్మాత భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడిని త్వరలోనే ఫిక్స్ చేయనున్నారు.