ఆ మూవీతో అనుకోకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా మారిన బాలు

బాలు అనుకోకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా మారారు. అందులో కమల్ హాసన్‌కు తెలుగులో డబ్బింగ్ చెప్పారు.

Update: 2020-09-25 08:16 GMT

బాలు డబ్బింగ్ ఆర్టిస్టుగా అనేకమంది కళాకారులకు గాత్రదానం చేశారు. కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, నగేష్, రఘువరన్ లాంటి వాళ్ళకి గాత్రదానం చేసారు. కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన తమిళ డబ్బింగ్ సినిమా మన్మధ లీలతో బాలు అనుకోకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా మారారు. అందులో కమల్ హాసన్‌కు తెలుగులో డబ్బింగ్ చెప్పారు. అంతేకాదు తమిళం నుంచి తెలుగులోకి అనువాదమయ్యే కమల్ హాసన్ చిత్రాలన్నింటికీ బాలునే డబ్బింగ్ చెప్పారు. 2010లో వచ్చిన దశావతారం చిత్రంలో కమల్ పోషించిన పది పాత్రల్లో ఏడింటికి బాలసుబ్రహ్మణ్యమే డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇందులో కమల్ పోషించిన ముసలావిడ పాత్ర కూడా ఉంది. అన్నమయ్య చిత్రంలో సుమన్‌తోపాటు సాయి మహిమ చిత్రంలోనూ బాలు డబ్బింగ్ చెప్పారు. ఈ రెండు సినిమాలకు బాలుకు ఉత్తమ డబ్బింగ్ కళాకారుడిగా నంది పురస్కారం వరించింది.

Tags:    

Similar News