Kovai Sarala : ఇందుకే కోవై సరళ వివాహం చేసుకోలేదట..!

కోవై సరళ వెండితెరకి పరిచయం అక్కరలేని పేరు. తమిళ్, తెలుగు బాషలలో కలిపి దాదాపుగా 800చిత్రాలలో నటించి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకుంది.

Update: 2021-07-08 13:31 GMT

కోవై సరళ వెండితెరకి పరిచయం అక్కరలేని పేరు. తమిళ్, తెలుగు బాషలలో కలిపి దాదాపుగా 800చిత్రాలలో నటించి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకుంది. ముఖ్యంగా కామెడీ పండించడంలో అమెది ప్రత్యేకమైన శైలి అని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఆమె సినిమాల్లో నటిస్తూనే.. పలు షోలకి జడ్జీగా వ్యవహరిస్తుంది. ఇదిలా ఉంటే కోవై సరళ అవివాహిత అన్న విషయం చాలా మందికి తెలియదు. అవును.. ఆమె ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆమెకి ప్రస్తుతం 59 సంవత్సరాలు.

తమిళనాడులోని కోయంబత్తూరులో ఒక మలయాళీ కుటుంబంలో జన్మించిన కోవై సరళ.. చిన్నప్పుడు ఎంజీఆర్ సినిమాలు చూసి నటనపైన ఆసక్తి పెంచుకోంది. అలా తండ్రి, సోదరి ప్రోత్సాహంతో సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది. ఆమె తొమ్మిదో తరగతిలో ఉండగా విజయ కుమార్, కె.ఆర్. విజయ సరసన 'వెల్లిరథం' అనే సినిమాలో మొట్టమొదటి సారిగా కనిపించింది. పదో తరగతిలో ఉండగా ముంధనై ముడిచ్చు అనే సినిమాలో 32 ఏళ్ళ గర్భిణిగా నటించింది. రెండు సంవత్సరాల తరువాత చిన్నవీడు అనే సినిమాలో భాగ్యరాజా పాత్రకు తల్లిగా 65 ఏళ్ళ మహిళ పాత్రలో నటించింది.

ఆమె నటనకి గాను తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మూడుసార్లు నంది అవార్డు అందుకోగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఓరి నీప్రేమ బంగారం(2003) అనే సినిమాకి గాను నంది ఉత్తమ హాస్యనటి పురస్కారం అందుకుంది. అయితే కోవై సరళకి నలుగురు చెల్లెళ్ళు ఉన్నారు. దీంతో వారికి వివాహం చేస్తూ, వారి పిల్లలను చూసుకుంటూ వారికి మంచి విద్యను అందిస్తూ తాను ఒంటరిగా ఉండిపోయింది. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Tags:    

Similar News