'అలీతో సరదాగా'... వచ్చే గెస్ట్‌లకి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతంటే?
బుల్లితెర పైన సక్సెస్ అయిన షోలలో అలీతో సరదాగా షో ఒకటి.. కమెడియన్ అలీ హోస్ట్ గా చేస్తున్న ఈ షోకి పాత కొత్త అనే తేడా లేకుండా అందరు సెలబ్రిటీస్ వస్తుంటారు.;
బుల్లితెర పైన సక్సెస్ అయిన షోలలో అలీతో సరదాగా షో ఒకటి.. కమెడియన్ అలీ హోస్ట్ గా చేస్తున్న ఈ షోకి పాత కొత్త అనే తేడా లేకుండా అందరు సెలబ్రిటీస్ వస్తుంటారు. ఐదేళ్ళ క్రితం మొదలైన ఈ షో ఇప్పటికీ ఫుల్ సక్సెస్ తో దూసుకుపోతుంది.
అయితే ఈ షోకి వచ్చే సెలబ్రిటీలకి ఎంత రెమ్యునరేషన్ ఇస్తారు? లేకా ఫ్రీగానే వస్తారా అనే అనుమానం చాలా మందిలో ఉంది. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న సమాచారం మేరకు షోకు వచ్చే అతిథులకు ఎపిసోడ్‌కు లక్ష రూపాయలు ఇస్తారని తెలుస్తోంది.
ఇక సెలబ్రిటీల రేంజ్ ని బట్టి వాళ్లకు ఫ్లైట్ టికెట్.. హోటల్ ఖర్చులు అదనంగా ఉంటాయని తెలుస్తోంది. షోకి వచ్చి వెళ్ళే వరకు వారిని జాగ్రత్తగా చూసుకుని పంపిస్తారు. ఇక సినిమా ప్రమోషన్ కోసం వచ్చేవారు మాత్రం ఫ్రీగా వస్తారని సమాచారం. అయితే ఈ షోలో ప్రమోషన్ కోసం వచ్చేవారి సంఖ్య తక్కువేనని చెప్పాలి.
కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, బాబు మోహన్, జాకీ, హరిత, అన్నపూర్ణమ్మ, వై విజయ లాంటి నటీనటులు ఈ షోకి గెస్ట్ లుగా వచ్చారు. వచ్చే ఎపిసోడ్ లో బెనర్జీ, జీవా కలిసి వస్తున్నారు.