ట్రెండింగ్‌లో అల్లు అర్జున్ 'పుష్ప' టీజర్..!
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.;
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఈ సినిమాలో అల్లుఅర్జున్ లారీ డ్రైవర్‌గా నటిస్తున్నాడు. బన్నీకి జోడీగా రష్మిక మందన్నా నటిస్తోంది. బన్నీ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
అయితే ఈ టీజర్ యూట్యూబ్‌లో 50 మిలియన్ల వ్యూస్‌ను అందుకోగా 1.2 మిలియన్ లైక్స్‌ను సంపాదించింది. అత్యంత తక్కువ టైంలోనే 50 మిలియన్ల వ్యూస్ మార్క్‌ను చేరుకున్న తెలుగు టీజర్‌గా 'పుష్ప' రికార్డుకెక్కింది. అంతకుముందు త్రిబుల్ ఆర్ టీజర్ ఒక్కటే 50 మిలియన్ మార్క్ అందుకుంది.
కాగా ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో పహాద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నాడు. ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది.