'అవసరానికి వాడుకుంటారు.. అవసరం తీరాక ఆడుకుంటారు'..Anasuya Tweet Viral
Anasuya Bharadwaj.. ఎవరేమనుకుంటే నాకేంటి అని ఏ విషయమైనా బోల్డ్‌గా మాట్లాడేస్తుంది. అనసూయ ట్వీట్‌కు హీరో రీప్లై ఇచ్చారు.;
Anasuya Bharadwaj.. బుల్లితెర మీద అందాల యాంకర్‌గా ఎన్ని వగలు పోయినా.. రొమాంటిక్ స్టెప్పులతో కనివిందు చేసినా.. వెండి తెర మీద ఏదైనా పాత్రకు అవకాశం వచ్చిందంటే దటీజ్ అనసూయ అనిపించుకుంటుంది ఈ జబర్థస్త్ బ్యూటీ.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తు ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటుంది. ఎవరేమనుకుంటే నాకేంటి అని ఏ విషయమైనా బోల్డ్‌గా మాట్లాడేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఆమె చేసే ట్వీట్స్ ఒక్కోసారి వైరల్‌గా మారుతుంటాయి. తాజాగా అలాంటి ఓ ట్వీట్ చేసింది అనసూయ.
"అవసరమని వేడుకుంటారు.. అవసరానికి వాడుకుంటారు.. అవసరం తీరాక ఆడుకుంటారు" అని ట్వీట్ చేసింది. ఈ క్యాప్షన్‌తో పాటు #Coming soon అంటూ తను నటిస్తున్న 'చావు కబురు చల్లగా' మూవీలోని లుక్‌ను షేర్ చేసింది.
"అవసరమని వేడుకుంటారు.. అవసరానికి వాడుకుంటారు.. అవసరం తీరాక ఆడుకుంటారు." #comingSoon https://t.co/k1x6ZVd3bY
— Anasuya Bharadwaj (@anusuyakhasba) February 15, 2021
అనసూయ ట్వీట్‌కు (Anasuya Tweet) హీరో కార్తికేయ రీప్లై ఇచ్చారు. 'మీ ప్రజేన్స్‌తో మా మూవీను మరింత ప్రత్యేకం చేసినందుకు ధన్యవాదాలు అనసూయ గారు.. ఈ స్పెషల్ సాంగ్ చూడాలంటే కొద్ది రోజులు వేచి చూడండి' అంటూ హీరో కార్తికేయ ట్వీట్ చేశాడు.
Its a delight to have shaken a leg with you Kartikeya! You are a fab dancer!! Can't wait for all to watch us perform.. 🤗🤗 https://t.co/y7Pn7TV3V6
— Anasuya Bharadwaj (@anusuyakhasba) February 15, 2021
కాగా 'చావు కబురు చల్లగా' మూవీలో అనసూయ ఓ ఐటమ్ సాంగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కౌశిక్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కార్తికేయకు జోడిగా లావణ్య త్రిపాఠి నటిస్తోంది.