అనుదీప్ ఆగట్లేదుగా.. 'జాతిరత్నాలు' సక్సెస్‌తో..
అదృష్టం మొదటి సినిమాతోనే కలిసొచ్చింది అనుదీప్‌కి..;
అదృష్టం మొదటి సినిమాతోనే కలిసొచ్చింది అనుదీప్‌కి.. యంగ్ జనరేషన్‌ని ఆకట్టుకునే కథాంశంతో అద్భుతంగా తెరకెక్కించాడు జాతిరత్నాలు చిత్రాన్ని. మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకుడికి ఎక్కడా బోరు కొట్టించకుండా ఆద్యంతం నవ్వులు పండించడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు. ఎంచుకున్న నటులు కూడా కథకు వంద శాతం న్యాయం చేశారు.
ఇక ఈ చిత్రం అందించిన ఉత్సాహంతో మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు అనుదీప్. ఇది కూడా వైజయంతీ బ్యానర్‌లోనే ఉండబోతోందని టాక్. కామెడీ ట్రాకే కలిసోచ్చిన అంశంగా భావించి తన తరువాతి సినిమాని ఫుల్ లెంగ్త్ కామెడీగా మలచనున్నట్లు తెలుస్తోంది.
ఈ కథకు రామ్‌ని హీరోగా ఎంచుకున్నారట. మొదటి చిత్రంలో జోగిపేట ప్రాంతం నుంచి పట్నం వచ్చిన ముగ్గురు యువకులు అనూహ్యంగా మర్డర్ కేసులో చిక్కుకుని ఆ కేసు నుంచి ఎలా బయటపడతారనేది కథాంశం.
అయితే ఈసారి హీరో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనే క్రమంలో పడే ఇబ్బందులను కామెడీ వేలో తెరకెక్కించనున్నాడట. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది.