jeevitha Rajasekhar : నరేష్‌ను టార్గెట్ చేసిన జీవిత..!
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఏ పనైనా ఆగిందంటే దానికి కేవలం నరేష్ మాత్రమేనని విమర్శించారు జీవిత.;
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఏ పనైనా ఆగిందంటే దానికి కేవలం నరేష్ మాత్రమేనని విమర్శించారు జీవిత. తాను బాధ్యతతో పనిచేస్తుంటే ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. నరేష్ మాట్లాడే దానికి అర్థం ఉండాలంటూ హాట్ కామెంట్స్ చేశారు. ప్రకాష్‌రాజ్‌ని నాన్ లోకల్ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేష్ ఎందుకింత కక్ష గట్టారో అర్థం కావడం లేదన్నారు. మా అంటే అందరూ అసహ్యించుకునే విధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.