Jr NTR Mask Viral : ఎన్టీఆర్ ధరించిన ఈ మాస్క్ ధరెంతో తెలుసా?
సాధరణంగానే సెలబ్రిటీలు ధరించే ప్రతి ఒక్క ఐటెం చాలా కాస్ట్‌లీగానే ఉంటాయి. అయితే వీటి ధర తెలుసుకోవడానికి అభిమానులు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.;
సాధరణంగానే సెలబ్రిటీలు ధరించే ప్రతి ఒక్క ఐటెం చాలా కాస్ట్‌లీగానే ఉంటాయి. అయితే వీటి ధర తెలుసుకోవడానికి అభిమానులు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అందులో భాగంగానే తాజాగా సుకుమార్ ఇంట్లో వేడుకకి హాజరైనా హీరో జూనియర్ ఎన్టీఆర్ ధరించిన మాస్క్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ ధరించిన ఈ మాస్క్ ధరెంత? ఆ మాస్క్ బ్రాండ్ ఏంటి? అనే దానిపైన నెటిజన్లు సెర్చ్ కూడా మొదలుపెట్టేశారు.
ప్రముఖ యూఎస్ స్పోర్ట్స్ కంపెనీకి చెందిన ఈ మాస్క్ ధర రూ.2340 వరకు ఉంటుందని తెలుస్తోంది. అయితే అదే బ్రాండ్ ను వాడేందుకు ఆయన అభిమానులు కూడా ఆసక్తిని చూపిస్తున్నారట.. కాగా గతంలో రాజమౌళి కొడుకు పెళ్లికి హాజరైన ఎన్టీఆర్.. 25 లక్షల వాచ్, 75 వేల ఉన్న షూస్ ధరించి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ అనే చిత్రాన్ని చేస్తున్నారు.