K Raghavendra Rao : న్యూటన్ కంటే నేనే గ్రేట్... దర్శకేంద్రుడి ఆన్సర్ వింటే మైండ్ బ్లాక్..!
K Raghavendra Rao : ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన "పెళ్ళిసందD" మూవీ ప్రమోషన్ లో భాగంగా తన టీంతో కలిసి యాంకర్ సుమతో క్యాష్ ప్రోగ్రాంలో సందడి చేశారు..;
K Raghavendra Rao : దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు... తెలుగు సినిమాకి గ్లామర్ డోస్ అద్దిన ఘనుడాయన.. హీరోయిన్ లను గ్లామర్ చూపించాలంటే ఆయన తర్వాతే ఎవరైనా.. ఒక్కసారి ఆయన సినిమాలో నటిస్తే చాలు ఫేట్ మారిపోతుందని అనుకున్న హీరోయిన్‌లు అబ్బో చాలానే మంది ఉన్నారులెండి.. దర్శకేంద్రుడి సినిమాల్లో పాటలలంటే మనకి టక్కున గుర్తొచ్చేవి పూలు, పండ్లు మాత్రమే.
ద్రాక్ష, దానిమ్మ, యాపిల్, బత్తాయి, నేరేడు ఇలా అన్ని పండ్లతో హీరోయిన్లపై అన్ని ప్రయోగాలు చేశారాయన. ఇదిలావుండగా తాజాగా ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన "పెళ్ళిసందD" మూవీ ప్రమోషన్ లో భాగంగా తన టీంతో కలిసి యాంకర్ సుమతో కలిసి క్యాష్ ప్రోగ్రాంలో సందడి చేశారు.. దీనికి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు.
ఈ ప్రోమోలో కింగ్ అఫ్ ఫ్రూట్ అని దేనిని పిలుస్తారని అని యాంకర్ సుమ అడగగా.. రాఘవేంద్రరావు యాపిల్ అని సమాధానం ఇచ్చారు. ఎందుకంటే.. 'యాపిల్ పడినపుడే న్యూటన్ గ్రావిటీని కనిపెట్టాడు. యాపిల్ ఎక్కడ పడాలో నేను కనిపెట్టాను' అని చెప్పి నవ్వులు పూయించారు.
ఇక ప్రోమో చివర్లో... ఇక్కడ జరిగేది చీటింగ్. మా టీమ్ అంతా ఫూల్స్‌లా కనపడుతున్నామా అంటూ కాస్త సీరియస్ అయి అక్కడి నుంచి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఇంతలో సుమ ఆయన దగ్గరికి వెళ్లి సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే.