Kajal Aggarwal: సినిమాల్లోకి కాజల్ రీ ఎంట్రీ.. అందుకే ఆ ప్రయత్నాలు..
Kajal Aggarwal: ఇక కాజల్‌ను తెరపై చూసే అవకాశం రాదని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు.;
Kajal Aggarwal: పర్సనల్ లైఫ్ కోసం సినిమాలకు దూరమయిన నటీమణులు ఎందరో మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ సపోర్టింగ్ రోల్స్‌తో, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో రీ ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తున్న హీరోయిన్లు ఎందరో ఉన్నారు. అదే లిస్ట్‌లోకి చేరడానికి సిద్ధమవుతోంది కాజల్ అగర్వాల్.
దాదాపు పదేళ్లకు పైగా సౌత్ ఇండస్ట్రీలో చందమామలాగా వెలిగిపోయింది కాజల్. యంగ్ హీరోలతోనే కాకుండా సీనియర్ హీరోలతో కూడా జోడీకడుతూ ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకుంది. బిజినెస్‌మెన్ గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకునే సమయానికి కూడా సినిమాల్లో కాజల్ బిజీగానే ఉంది. కానీ పెళ్లి తర్వాత ఒకటొకటిగా అన్ని ప్రాజెక్ట్స్ నుండి తప్పుకుంటూ వచ్చింది. ఆ తర్వాత ఓ మగబిడ్డకు జన్మనిచ్చి పూర్తిగా ఫ్యామిలీ ఉమెన్ అయిపోయింది.
ఇక కాజల్‌ను తెరపై చూసే అవకాశం రాదని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. కానీ ఇంతలోనే మళ్లీ ఫోటోషూట్స్‌తో కాజల్ బిజీ అయిపోయింది. ప్రెగ్నెన్సీ వల్ల బరువు పెరిగిన కాజల్.. వరుసగా వర్కవుట్స్ చేస్తూ.. నాజుగ్గా అవ్వడానికి ప్రయత్నిస్తోంది. ఇది తన ఫోటోషూట్స్‌ను చూస్తే అర్థమవుతోంది. దీంతో కాజల్ మళ్లీ రీ ఎంట్రీకి ప్లాన్ చేస్తోందని, మంచి కథ కోసం ఎదురుచూస్తోందని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.