Kajal Aggarwal : ఆ సినిమా కోసం కాజల్ చాలా కష్టపడుతోంది..
Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ తల్లి అయిన తరువాత ఆమె నటించబోయే సినిమాలపై ప్రేక్షకుల్లో ఎక్కువ ఆసక్తి ఉంది;
Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ తల్లి అయిన తరువాత ఆమె నటించబోయే సినిమాలపై ప్రేక్షకుల్లో ఎక్కువ ఆసక్తి ఉంది. గతంలో కంటే కాజల్ ఇప్పుడు కొంత బొద్దుగా మారింది. ఆమె తదుపరి చిత్రం ఇండియన్ 2 అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆమె పవర్ఫుల్ పాత్ర పోషిస్తోంది. అందులో యాక్షన్స్ సీన్స్‌లో నటించనుంది. దీనికి కోసం కాజల్ గత మూడేళ్లుగా 'కళరిపయట్టు' అనే కేరళ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటోంది. దీనికి సంబంధించి ఆమె ఇన్స్‌టాగ్రాంలో తాజాగా పోస్ట్ చేసింది. సమయం దొరికినప్పుడల్లా కళరిపయట్టును నేర్చుకుంటున్నట్లు ఆమె తెలిపింది.
ఇక 1996లో విడుదలైన కమల్ హాసన్ సూపర్‌హిట్ మూవీ 'భారతీయుడుకి' ఇండియన్ 2 చిత్రం సీక్వెల్ అన్న విషయం తెలిసిందే. దర్శకుడు శంకర్ దీనిని డైరెక్ట్ చేస్తున్నారు. కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.