Bimbisara Movie: 'బింబిసార'లో ఎన్‌టీఆర్..! క్లారిటీ ఇచ్చిన కళ్యాణ్ రామ్..
Bimbisara Movie: బింబిసారలో ఎన్‌టీఆర్ ఉంటాడా లేదా అనేదానిపై ఇటీవల క్లారిటీ ఇచ్చారు కళ్యాణ్ రామ్.;
Bimbisara Movie: నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. ఇప్పటివరకు తన కెరీర్‌లో చేయని కొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆ ప్రయోగం పేరు 'బింబిసార'. కళ్యాణ్ రామ్ ఎప్పుడూ కమర్షియల్ కథలకంటే డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న చిత్రాలనే ఎక్కువగా చేయడానికి ఇష్టపడతారు. కానీ ఈసారి పాన్ ఇండియా లెవెల్‌లో ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రంతో ముందుకొస్తున్నారు. అయితే బింబిసారలో ఎన్‌టీఆర్ ఉండబోతున్నారా లేదా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
నందమూరి హీరోలు ఎప్పుడూ పెద్దగా కలిసి నటించలేదు. ఈవెంట్స్‌లో స్టేజ్ షేర్ చేసుకున్నారు కానీ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న సందర్భాలు లేవు. అయితే కళ్యాణ్ రామ్ మొదటిసారి తన కెరీర్‌లో ఓ భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తుండడంతో.. దీనికి ఎన్‌టీఆర్ క్రేజ్ కూడా యాడ్ అయితే సినిమాకు అంచనాలు భారీగా పెరిగిపోతాయి అనుకోవడంలో ఆశ్చర్యం లేదు. బింబిసారలో ఎన్‌టీఆర్ ఉంటాడా లేదా అనేదానిపై ఇటీవల క్లారిటీ ఇచ్చారు కళ్యాణ్ రామ్.
వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న బింబిసార.. ఒక్క భాగంతో ఆగిపోయేది కాదని కళ్యాణ్ రామ్ క్లారిటీ ఇచ్చారు. ఇది నాలుగు భాగాలు ఉంటుందని.. అందులో ఏదో ఒక భాగంలో కచ్చితంగా ఎన్‌టీఆర్ ఉండబోతాడని నందమూరి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు కళ్యాణ్ రామ్. హై ఎండ్ విజువల్స్‌తో తెరకెక్కుతున్న బింబిసార.. ఆగస్ట్ 5న థియేటర్లలో విడుదల్వడానికి సిద్ధమవుతోంది.