Kalyan Ram : 'బింబిసార'.. కళ్యాణ్ రామ్ మరో ప్రయోగం..!
Kalyan Ram : హీరోగా, నిర్మాతగా విభిన్నమైన చిత్రాలను చేస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు నందమూరి కళ్యాణ్ రామ్.;
Kalyan Ram : హీరోగా, నిర్మాతగా విభిన్నమైన చిత్రాలను చేస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు నందమూరి కళ్యాణ్ రామ్.. ఇప్పుడు మరో ప్రయోగానికి సిద్దమయ్యారయన... అందులో భాగంగా బింబిసార అనే సినిమాని అనౌన్స్ చేశారు. స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇందులో కళ్యాణ్ రామ్ సరికొత్తగా కనిపిస్తున్నారు.
.క్రూరుడైన బింబిసారుడు లుక్‌లో యుద్ధ రంగంలో శత్రు సైనికులను చంపి వారి శవాలపై ఠీవిగా కూర్చున్న కళ్యాణ్ రామ్ లుక్.. సినిమా పైన ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో రాజేంద్ర అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. కాగా ఈ సినిమాను ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ రెడ్డి తనయుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ పేరును నిర్మాతగా పరిచయం చేస్తున్నారు కళ్యాణ్ రామ్.