Karthikeya 2: 'కార్తికేయ 2' మళ్లీ వాయిదా.. మమ్మల్నే తగ్గమంటున్నారంటూ నిఖిల్ కామెంట్స్..
Karthikeya 2: నిఖిల్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది ‘కార్తికేయ’. ఈ చిత్రం మంచి వసూళ్లనూ సాధించింది.;
Karthikeya 2: టాలీవుడ్‌లో వైవిధ్యభరితమైన కథలకు క్రేజ్ పెరిగింది. ఇక చాలామంది యంగ్ హీరోలు కూడా తమ ప్రతీ సినిమా కోసం వైవిధ్యభరితమైన కథలను ఎంచుకోవడానికే ఇష్టపడుతున్నారు. అందులో ఒకరు నిఖిల్. చాలాకాలం ఫ్లాపుల్లో ఉన్న నిఖిల్‌కు లైఫ్ ఇచ్చింది డిఫరెంట్ కథలే. అందుకే అప్పటినుండి నిఖిల్ కమర్షియల్ సినిమాలకు దూరమయ్యి.. డిఫరెంట్ కథలకు దగ్గరయ్యాడు. అలాంటి ఒక సినిమానే 'కార్తికేయ 2'.
నిఖిల్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది 'కార్తికేయ'. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి వసూళ్లను సాధించింది. అయితే ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని టీమ్ ఎప్పుడో ప్రకటించినా.. అది ప్రేక్షకుల ముందుకు రావడానికి మాత్రం ఇంతకాలం పట్టింది. షూటింగ్, విడుదల తేదీ.. ఎన్నోసార్లు వాయిదా పడిన తర్వాత ఆగస్ట్ 12న మూవీ రిలీజ్ ఖరారు చేసుకుంది. కానీ ఇప్పుడు ఈ డేట్‌లో కూడా మార్పు రానుంది.
ఆగస్ట్ 12న విడుదల కావాల్సిన కార్తికేయ 2.. ఆగస్ట్ 13కు పోస్ట్‌పోన్ అయినట్టు మూవీ టీమ్ ప్రెస్ మీట్‌లో ప్రకటించింది. ఇప్పుడు ఒత్తిడి కారణంగా తమ రిలీజ్ డేట్‌ను మార్చుకుంటూ రావాల్సి వచ్చిందని, దాని వల్ల తాను చాలా బాధపడ్డానని వెల్లడించిన నిఖిల్.. మరోసారి ఈ విషయంపై స్పందించాడు. ఎందుకు ఇన్నిసార్లు ఈ సినిమా పోస్ట్‌పోన్ అవుతుంది అని ప్రశ్నకు.. ప్రతీసారి మమ్మల్నే తగ్గమంటున్నారు అంటూ నిఖిల్ నిరాశగా సమాధానం ఇచ్చాడు.
The Mystical Adventure #Karthikeya2 hits the big screens on August 13th 💥#Karthikeya2OnAug13 🔥#KrishnaIsTruth@actor_Nikhil @anupamahere @AnupamPKher @chandoomondeti @vishwaprasadtg @AbhishekOfficl @vivekkuchibotla @MayankOfficl @peoplemediafcy @AAArtsOfficial pic.twitter.com/XchDYB3Kad
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) August 3, 2022