RRR Movie: 'ఎన్‌టీఆర్, చరణ్ చాలా అందంగా ఉన్నారు'.. 'ఆర్ఆర్ఆర్'పై పోర్న్ స్టార్ ట్వీట్..
RRR Movie: హాలీవుడ్ మేకర్స్, నటులు ఎంతోమంది ఇప్పటికీ ఆర్ఆర్ఆర్‌పై స్పందించారు. దాని వల్లే రేంజ్ మరింత పెరిగిపోయింది.;
RRR Movie: 'ఆర్ఆర్ఆర్' సినిమా పాపులారిటీ దేశాలు, ఖండాలు దాటి ఎక్కడెక్కడికో వెళ్లిపోతోంది. ఇప్పటికీ ఈ మూవీని ఓటీటీలో చూస్తున్న ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా దీనిపై స్పందిస్తున్నారు. దీంతో పాన్ ఇండియా రేంజ్ నుండి పాన్ వరల్డ్ రేంజ్‌కు ఎదిగిపోయారు రాజమౌళి. ఇటీవల ఓ పోర్న్ స్టార్ కూడా ఈ సినిమాపై ట్వీట్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
హాలీవుడ్ మేకర్స్, నటులు ఎంతోమంది ఇప్పటికీ ఆర్ఆర్ఆర్‌పై స్పందించారు. దాని వల్లే ఆర్ఆర్ఆర్ రేంజ్ మరింత పెరిగిపోయింది. ఇక దీని వల్ల ఎన్‌టీఆర్, రామ్ చరణ్ అప్‌కమింగ్ సినిమాలపై కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. రాజమౌళి కూడా తన తరువాతి సినిమాలను పక్కాగా ప్లాన్ చేసుకునే పనిలో పడ్డాడు. ఇక తాజాగా పోర్న్ స్టార్ కేండ్రా లస్ట్ కూడా ఆర్ఆర్ఆర్‌పై చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
'నెట్‌ఫ్లిక్స్‌లో ఆర్ఆర్ఆర్ చూశాను. పూర్తిగా మైమరచిపోయాను. రామ్ చరణ్, ఎన్‌టీఆర్ వావ్ అనిపించారు. ఆ సినిమా, యాక్టింగ్, పాటలు, సినిమాటోగ్రాఫీ, స్టంట్స్, డైలాగ్ డెలివరీ అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. ఇద్దరు నటుడు అందంగా ఉన్నారు. వారి యాక్టింగే సినిమాకు ప్రాణం' అని ట్వీట్ చేసింది కేండ్రా లస్ట్. ఈ ట్వీట్‌ను చూసి ఇండియన్ సినిమాకు తను ఫ్యాన్ అయిపోయింది అని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం ఇది పెయిడ్ ట్వీట్ అని విమర్శిస్తున్నారు.