Allu Arjun : అల్లు అర్జున్ కి అభిమాని స్పెషల్ గిఫ్ట్ .. 160 ఏళ్ల ..!
Allu Arjun : టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తెలుగు రాష్ట్రాలతో పాటుగా తమిళనాడు, కేరళలో కూడా బన్నీకి ఫ్యాన్స్ ఎక్కువగానే ఉన్నారు.;
Allu Arjun : టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తెలుగు రాష్ట్రాలతో పాటుగా తమిళనాడు, కేరళలో కూడా బన్నీకి ఫ్యాన్స్ ఎక్కువగానే ఉన్నారు. కేరళలో బన్నీని ముద్దుగా మల్లు అర్జున్ అని పిలుస్తుంటారు. అక్కడి అభిమానులతో కూడా బన్నీ మంచి టచ్‌లో ఉంటాడు. అయితే తాజాగా బన్నీకి ఓ కేరళ అభిమాని స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి సప్రైజ్ చేశాడు. కేరళలో పుట్టి దుబాయ్‌లో స్థిరపడిపోయిన మల్టీ మిలియనీర్ రియాజ్ కిల్టన్ అల్లు అర్జున్‌కి వీరాభిమాని.. బన్నీని కలవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. పుష్ప షూటింగ్ కోసం యూఏఈ వెళ్లిన బన్నీని కిల్టన్ కలిశాడు. ఈ సందర్భంగా బన్నీకి 160 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన పిస్టల్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ విషయాన్ని స్వయంగా తానే సోషల్ మీడియా వేదికగా తెలియచేస్తూ వీడియోని షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.