దర్శకుడు రాఘవేంద్రరావు ఇంట విషాదం..!
టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కే. రాఘవేంద్రరావు అన్నయ్య ఆర్కే ఫిలిమ్స్ అధినేత కోవెలమూడి కృష్ణమోహన్ రావు(81) తుదిశ్వాస విడిచారు.;
టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కే. రాఘవేంద్రరావు అన్నయ్య ఆర్కే ఫిలిమ్స్ అధినేత కోవెలమూడి కృష్ణమోహన్ రావు(81) తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. బుధవారం మధ్యాహ్నం ఫిలింనగర్‌లోని తన నివాసంలో మృతిచెందారు. ఆయనకి ఇద్దరు కుమార్తెలున్నారు. వారిలో ఒకరు బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ భార్య లక్ష్మీ. మరో కుమార్తె లత. రేపు అయన అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరగనున్నాయి. కాగా కోవెలమూడి కృష్ణమోహన్ రావు తన తమ్ముడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పలు సినిమాలని నిర్మించారు.