Krithi Shetty: అందుకే బాలీవుడ్ ఆఫర్లు వదులుకున్నా: కృతి శెట్టి
Krithi Shetty: ‘ది వారియర్’తో మొదటి ఫ్లాప్ అందుకున్న కృతి.. ‘మాచర్ల నియోజకవర్గం’తో మళ్లీ ఫామ్‌లోకి రావాలి అనుకుంటోంది.;
Krithi Shetty: ఈరోజుల్లో ఓ హీరోయిన్ డెబ్యూ సినిమా హిట్ టాక్ అందుకుంటే చాలు.. తన కాల్ షీట్స్ కోసం సీనియర్ నిర్మాతలు సైతం క్యూ కడుతున్నారు. డెబ్యూ మూవీతో పాటు మరో రెండు హిట్లు పడితే ఇక తనకు గోల్డెన్ లెగ్ హీరోయిన్‌గా ముద్రపడినట్టే. అప్పుడు తన క్రేజ్ మరింత పెరుగుతుంది. తాజాగా అందాల బేబమ్మ కృతి శెట్టి పరిస్థితి కూడా అలాగే ఉంది.
'ఉప్పెన' సినిమాతో పరిచయమయిన కృతి శెట్టి.. ఆ మూవీ విడుదల అవ్వకముందే దాదాపు అరడజను ఆఫర్లను అందుకుంది. తనకు ఎదురొచ్చిన ప్రతీ చిత్రాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్లిన కృతికి ఆ తర్వాత వచ్చే అవకాశాల గురించి ఆలోచించడానికి కూడా సమయం లేకుండా పోయింది. ఇక ఇటీవల విడుదలయిన 'ది వారియర్'తో కెరీర్‌లో మొదటి ఫ్లాప్ అందుకున్న కృతి.. 'మాచర్ల నియోజకవర్గం'తో మళ్లీ ఫామ్‌లోకి రావాలి అనుకుంటోంది.
నితిన్ హీరోగా తెరకెక్కిన 'మాచర్ల నియోజకవర్గం' ఆగస్ట్ 12న విడుదల కానుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్‌లో టీమ్ అంతా బిజీగా ఉంది. అలాంటి సమయంలోనే కృతి.. తనకు వచ్చిన బాలీవుడ్ ఆఫర్ల గురించి బయటపెట్టింది. తనకు బాలీవుడ్ ఆఫర్లు కూడా వచ్చాయని కానీ తానే ఒప్పుకోలేదని చెప్పుకొచ్చింది. టాలీవుడ్ తనకు ఏం కావాలో అది ఇచ్చిందని, అందుకే తనకు బాలీవుడ్ వెళ్లాల్సిన అవసరం లేదని స్టేట్‌మెంట్ ఇచ్చేసింది కృతి శెట్టి.