Liger Song: 'లైగర్' నుండి మాస్ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. 'అకడి పకడి' అంటున్న విజయ్..
Liger Song: రౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరీర్‌లో చేస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’.;
Liger Song: రౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరీర్‌లో చేస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం 'లైగర్'. పూరీ జగన్నాధ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో విజయ్.. బాక్సర్‌గా కనిపించనున్నాడు. దీనికోసం ఈ హీరో స్పెషల్‌గా ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. పైగా ఈ సినిమాతో మైక్ టైసన్ మొదటిసారి ఇండియన్ సినిమాకు పరిచయమవుతున్నారు. తాజాగా లైగర్ నుండి ఓ మాస్ పాట ప్రోమో విడుదలయ్యింది.
లైగర్ సినిమా నుండి ఇప్పటివరకు గ్లింప్స్, టీజర్, ఓ పాట విడుదలయ్యాయి. కానీ అనన్య పాండే వాటిలో ఎక్కడా కనిపించలేదు. మొదటిసారి అనన్యతో విజయ్ స్టెప్పులేస్తున్న పాట ప్రోమో విడుదలయ్యింది. అదే అకడి పకడి. ఈ పాటలో విజయ్ మాస్ స్టెప్పులతో రెచ్చిపోయాడు. ఇక అనన్య పాండే కూడా తనదైన గ్లామర్‌ను పాటకు యాడ్ చేసింది. రౌడీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న లైగర్ సినిమా ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Lets go Boyyyysssss!!!
— Vijay Deverakonda (@TheDeverakonda) July 8, 2022
Full. All out. Mass 🤙🤙🤙
Here's #AKDIPAKDI Promo 💥
Song Releasing on
11th July @ 4:00 PM 🔥#Liger#LigerOnAug25th pic.twitter.com/GQQDwOGShX