Love Story Movie : మహేష్‌కు కలిసొచ్చిన 'లవ్ స్టోరీ'.. కాసుల వర్షం..!
Love Story Movie : అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం 'లవ్ స్టోరీ' .. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 24న విడుదలైంది.;
Love Story Movie : అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం 'లవ్ స్టోరీ' .. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 24న విడుదలైంది. మౌనిక, రేవంత్.. ఈ రెండు పాత్రలు సినిమాకి జీవం పోశాయనే చెప్పాలి. సున్నితమైన అంశాల్ని స్పృశిస్తూనే చక్కని భావోద్వేగాలతో ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు శేఖర్ కమ్ముల. మెుదటిరోజే ఊహకందని రీతిలో కలెక్షన్లను కొల్లగొట్టంది ఈ చిత్రం. రిలిజై నెల కావొస్తున్న ఇంకా ధియేటర్లో ఆడుతోంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ధియేటర్ లలో విడుదలైన పెద్ద సినిమా ఇదే కావడం విశేషం. ఇప్పుడు ఈ సినిమా రికార్డ్ స్టాయిలో కలెక్షన్స్ రాబడుతోంది.
దీనితో దర్శక-నిర్మాతలకే కాదు థియేటర్ల యాజమాన్యాలకు సైతం ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా ఏకంగా ఓ థియేటర్‌కు అయితే ఏకంగా కోటీ రూపాయలకు పైగా కలెక్షన్స్ ని తెచ్చిపెట్టింది. ఇంతకీ ఆ ఆ థియేటర్ ఎవరిదో కాదు... మహేష్ బాబుకి చెందిన ఏఎంబీ(AMB) సినిమాస్ మల్టీప్లెక్స్. ఆ మల్టీప్లెక్స్ లో కోటి రూపాయలు వసూలు చేసిన తొలిచిత్రం ఇదే కావడం విశేషం. ఇప్పటివరకు ఏఎమ్‌బీ థియేటర్లో 251 షోలు నిర్వహించగా.. 48,233 మంది వీక్షించారట.. దీనికి గాను సంతోషిస్తూ ట్వీట్ చేసింది ఏఎంబీ యాజమాన్యం.