lovestory: చైతూ.. మన 'లవ్‌స్టోరీ' బావుందంట..: ట్విట్టర్ రివ్యూ
సాయిపల్లవి, నాగచైతన్య రొమాన్స్ ఎంతో క్యూట్‌గా అనిపిస్తుంది. ఒకరికి ఒకరు నచ్చడం లాంటివి చిన్న చిన్న విషయాలను కూడా ఎంతో హృద్యంగా తెరకెక్కించారు శేఖర్ కమ్ముల.;
lovestory: లవ్ స్టోరీ.. ఎంతోమంది ప్రేక్షకులు చాలాకాలంగా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూసిన సినిమా. ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన లవ్ స్టోరీ ఇప్పటికీ రెండుసార్లు వాయిదా పడి ఈరోజు ఫైనల్‌గా థియేటర్లలో సందడిని ప్రారంభించింది. మరి ఇన్నాళ్ల ఎదురుచూపుల తర్వాత విడుదలయిన లవ్ స్టోరీ పాజిటివ్ బజ్‌ని క్రియేట్ చేసింది.
సాయిపల్లవి, నాగచైతన్య రొమాన్స్ ఎంతో క్యూట్‌గా అనిపిస్తుంది. ఒకరికి ఒకరు నచ్చడం లాంటివి చిన్న చిన్న విషయాలను కూడా ఎంతో హృద్యంగా తెరకెక్కించారు శేఖర్ కమ్ముల. అందుకే ఈ సినిమా ఇతర ప్రేమ కథల కంటే కొంచెం రిఫ్రెషింగ్‌గా కనిపిస్తుంది.
ఫస్ట్ హాఫ్ అందమైన ప్రేమకథతో, సెకండ్ హాఫ్ సీరియస్ సన్నివేశాలతో నిండిన లవ్ స్టోరీ ప్రేక్షకులను ఎక్కడా డిసప్పాయింట్ మాత్రం చేయలేదు. లీడ్ పెయిర్ అయిన నాగ చైతన్య, సాయి పల్లవి బెస్ట్ పర్‌ఫార్‌మెన్స్ ఇచ్చారని, ఈ లవ్ స్టోరీకి సాయి పల్లవి డాన్స్, మ్యూజిక్ స్పెషల్ అసెట్ అనే ట్వీట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. కథలో శేఖర్ కమ్ముల మార్క్ కనిపించిందని, మొత్తానికి థియేటర్స్‌లో చూడదగ్గ సినిమా అని, మూవీ పక్కా బ్లాక్ బస్టర్ అవుతుందని లవ్‌స్టోరీ గురించి రివ్యూలు అందుతున్నాయి.
సాయి పల్లవి యాక్టింగ్, డ్యాన్సులు ఎలా ఉంటాయో ప్రేక్షకులు ఇదివరకే చూసారు. కానీ ఈసారి నాగచైతన్య తన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. తెలంగాణ యాస కుర్రాడిగా నాగచైతన్య నటించడం ఇదే మొదటిసారి. అందుకే రేవంత్ క్యారెక్టర్‌లో లీనమవ్వడానికి చైతన్య ఎంత కష్టపడ్డాడో సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది. పైగా పూర్తిస్థాయిలో నాగచైతన్య డ్యాన్స్ టాలెంట్‌ను లవ్ స్టోరీ మనకు ప్రెజెంట్ చేసింది. శేఖర్ కమ్ముల కూడా ప్రేమకథలు తెరకెక్కించడంలో నెంబర్ వన్ అని మరోసారి నిరూపించారు. పవన్ సిహెచ్ సంగీతం మనల్ని ఉర్రూతలూగిస్తుంది.
Ntg but a
— Navinsayz🔔💥 (@navinsayz9) September 24, 2021
B-L-O-C-K-B-U-S-T-E-R 🌟✨🌠🔥💥❤️
Rewies & Ratings all over !!!!
So happy that @chay_akkineni babu steals the show with his Award Worthy acting !!!!❤️🥰#LoveStoryOnSep24th #LoveStory
Cant wait to begin with my show in few hours !!!! pic.twitter.com/3oBCjjRpv3
Good luck to the entire team of #LoveStory ! Looking forward to watch it in the theatres ! @chay_akkineni @Sai_Pallavi92 @sekharkammula @pawanch19 @SVCLLP #amigoscreations @AsianSuniel @adityamusic @NiharikaGajula @GskMedia_PR pic.twitter.com/q4FR09SY8f
— Annapurna Studios (@AnnapurnaStdios) September 23, 2021
#LoveStory All set to cross ₹2Cr Gross from Advance Sales in Hyderabad before first show in the city tomorrow. Tremendous 🔥🔥🔥#LoveStoryOnSep24th #NagaChaitanya #SaiPallavi
— TrackTollywood (@TrackTwood) September 23, 2021
ఈసారి కొడతనే 🤞#LoveStoryJukebox ► https://t.co/mWgRCOB5pB
— Aditya Music (@adityamusic) September 23, 2021
IN CINEMAS FROM TOMORROW#LoveStoryFromSep24th #LoveStory @chay_akkineni @Sai_Pallavi92 @sekharkammula @SVCLLP #amigoscreations @pawanch19 @AsianSuniel @NiharikaGajula @GskMedia_PR @adityamusic pic.twitter.com/chfOhF3vLs