MAA Elections 2021: అనసూయ భారీ మెజార్టీతో గెలిచిందనే వార్తల్లో నిజం లేదు : కృష్ణమోహన్
MAA Elections 2021: 'మా' లో ఎన్నికలు అయితే ముగిశాయి కానీ వివాదాలు, ఆరోపణలు మాత్రం కాదు.. ఎన్నికలు జరిగిన తీరుపై ప్రకాశ్ రాజ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.;
MAA Elections 2021: 'మా' లో ఎన్నికలు అయితే ముగిశాయి కానీ వివాదాలు, ఆరోపణలు మాత్రం కాదు.. ఎన్నికలు జరిగిన తీరుపై ప్రకాశ్ రాజ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని అన్నారు. తన ప్యానల్ నుంచి గెలిచిన 11 మందితో రాజీనామాలు చేయించాడు.
ఇక ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి ఈసీ మెంబర్‌గా పోటీ చేసి ఓడిపోయిన యాంకర్ అనసూయ కూడా పోలింగ్ తీరుపైన పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ వరుస ట్వీట్స్ చేసింది. అనసూయ ఆదివారం ఓట్ల లెక్కింపులో గెలిచినట్టుగా మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే మరుసటి రోజు జరిగిన ఓట్ల లెక్కింపులో అనసూయ ఓడిపోయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
దీనితో ఆమెతో పాటుగా అభిమానులు కూడా షాక్ అయ్యారు. ''రాత్రికి రాత్రి ఏం జరిగుంటుందబ్బా' అంటూ ఆమె సెటైరికల్‌గా ట్వీట్ చేశారు, అనసూయతో పాటుగా నటుడు ప్రభాకర్ కూడా ఎన్నికలు జరిగిన తీరు పైన అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్ స్పందించారు.
వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని అన్నారు. అనసూయ భారీ మెజార్టీతో గెలిచిందనే వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇక తాను బ్యాలెట్ పేపర్లను ఉంచిన బాక్స్‌ల తాళాలను మాత్రమే తీసుకెళ్లానని అన్నారు.