Mahesh Babu: మహేశ్, త్రివిక్రమ్ మూవీ అప్డేట్.. టైటిల్ రివీల్ ఎప్పుడంటే..
Mahesh Babu: మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా టైటిల్ రివీల్‌కు ముహూర్తం ఖరారు అయినట్టు టాక్..;
Mahesh Babu: మహేశ్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. చాలాకాలం తర్వాత వింటేజ్ మహేశ్‌ను చూశామన్న ఫ్యాన్స్ కామెంట్స్‌తో మూవీ టీమ్ అంతా ఫుల్ ఖుషీలో ఉంది. ఇదే సంతోషంలో మరో మూవీని ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడు మహేశ్. రాజమౌళి సినిమా ప్రారంభానికి ఎలాగో టైమ్ పడుతుంది కాబట్టి అంతలోపు త్రివిక్రమ్‌తో మూవీని పూర్తి చేద్దామనే ఆలోచన ఉన్నాడట ఈ హీరో.
మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చినవి రెండు సినిమాలే. కానీ ఆ రెండు ప్రేక్షకులకు ఎంతో ఫేవరెట్‌గా మారిన సినిమాలు. అందుకే మహేశ్‌ను త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తే మూవీ వేరే లెవెల్‌లో ఉంటుందని మహేశ్ 28వ సినిమాపై ప్రేక్షకులు అప్పుడే అంచనాలు పెంచేసుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంది. జులైలో మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా టైటిల్ రివీల్‌కు ముహూర్తం ఖరారు అయినట్టు టాక్ వినిపిస్తోంది. తన తండ్రి కృష్ణ పుట్టినరోజున అంటే మే 31న మహేశ్.. తన సినిమాలకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్‌ను ప్రకటిస్తూ ఉంటాడు. అయితే ఈసారి త్రివిక్రమ్‌తో తాను చేసే సినిమా టైటిల్ రివీల్ చేసి తన తండ్రి ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇవ్వనున్నాడు మహేశ్.