Mahesh Babu: రాజమౌళి సినిమా అంటే ప్రెజరా..? మహేశ్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్..
Mahesh Babu: మహేశ్ బాబు కనీసం ఏడాదికి ఒక సినిమా అయినా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు.;
Mahesh Babu: టాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్స్ సెట్ అయ్యి హిట్ కొట్టిన తర్వాత క్రేజ్ సంపాదించుకుంటాయి. కానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా కలిసి పనిచేయని హీరో, దర్శకుడు కాంబినేషన్‌కు కూడా క్రేజ్ ఉంటుంది. అది నిజమే అనిపించేలా చేస్తోంది మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్. ఇటీవల ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు మహేశ్ బాబు.
పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సూపర్ సక్సెస్‌ను సాధించింది. అందుకే ఈ సంతోషాన్ని ప్రేక్షకులతో పంచుకుంటున్నాడు మహేశ్. ఈ సమయంలో మహేశ్‌కు రాజమౌళి సినిమా గురించి పలు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. రాజమౌళితో సినిమా అంటే ప్రెజర్ కదా అని ఎదురైన ప్రశ్నకు మహేశ్ ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చాడు.
మహేశ్ బాబు కనీసం ఏడాదికి ఒక సినిమా అయినా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ రాజమౌళి మాత్రం ఒక్క సినిమాను తెరకెక్కించడానికే రెండు నుండి మూడేళ్లు సమయం తీసుకుంటాడు. అయితే దీని గురించి ప్రెజర్‌గా లేదా అని మహేశ్‌ను అడగగా.. ప్రస్తుతం ఈ సినిమా పట్ల తనకు ఎలాంటి ప్రెజర్ లేదని.. వర్క్ గురించి ఎగ్జైటింగ్‌గా మాత్రమే ఉందని మహేశ్ తెలిపాడు. ఎప్పటినుండో రాజమౌళితో సినిమా అనుకుంటున్నా.. ఫైనల్‌గా అది ఇప్పటికి సెట్ అయ్యిందన్నాడు మహేశ్.