Mahesh Babu: 'ప్రియమైన సూపర్ ఫ్యాన్స్‌కు'.. మహేశ్ బాబు ట్వీట్..
Mahesh Babu: మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ట్విటర్ అంతా తన హ్యాష్‌ట్యాగ్స్‌తో మోత మోగిపోయింది.;
Mahesh Babu: సినిమా హీరోల పుట్టినరోజు అంటే అభిమానుల హడావిడి మామూలుగా ఉండదు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఇదే ట్రెండింగ్‌గా ఉంటుంది. అంతే కాకుండా హీరో పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పలు కార్యక్రమాలు కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇటీవల జరిగిన మహేశ్ బాబు పుట్టినరోజుకు కూడా అదే జరిగింది. దీనిపై మహేశ్ స్పందించారు.
మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ట్విటర్ అంతా తన హ్యాష్‌ట్యాగ్స్‌తో మోత మోగిపోయింది. అభిమానులు మాత్రమే కాదు సినీ సెలబ్రిటీలు సైతం ట్విటర్ ద్వారా మహేశ్‌కు విషెస్ తెలిపారు. ఇక 'పోకిరి' సినిమా థియేటర్లలో మళ్లీ విడుదల అవ్వడం తన అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అలా మహేశ్ బర్త్ డే రోజు ఎక్కడ చూసినా తన గురించే కనిపించింది.
'ప్రియమైన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, నా సూపర్ ఫ్యాన్స్ మీ విషెస్‌కు థాంక్యూ. మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు రుణపడి ఉంటాను. గత ఏడాది చాలా బాగా గడిచింది. ఇక ముందు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఎదురుచూస్తున్నాను' అంటూ తన బర్త్ డేకు వచ్చిన విషెస్‌పై స్పందించాడు మహేశ్ బాబు. ప్రస్తుతం హాలిడేలో ఉన్న మహేశ్.. త్వరలోనే తన తరువాతి సినిమా షూటింగ్స్‌లో పాల్గోనున్నాడు.
❤️🙏 pic.twitter.com/iNiTlcRnZQ
— Mahesh Babu (@urstrulyMahesh) August 9, 2022