Manasanamaha: ఒక్క తెలుగు షార్ట్ ఫిల్మ్.. గిన్నీస్ రికార్డ్‌తో పాటు 513 అవార్డులు..

Manasanamaha: దీపక్ రెడ్డి తెరకెక్కించిన ‘మనసానమహా’ అనే షార్ట్ ఫిల్మ్ విడుదలయ్యి ఇప్పటికీ రెండేళ్లు అయ్యింది.

Update: 2022-06-28 13:30 GMT

Manasanamaha: ఒకప్పుడు షార్ట్ ఫిల్మ్స్ అనేవి ఫీచర్ ఫిల్మ్స్‌కు బాటలు వేసేవి. ఫీచర్ ఫిల్మ్‌లో నటీనటులుగా, డైరెక్టర్లుగా సెటిల్ అవ్వాలి అనుకునేవారు షార్ట్ ఫిల్మ్స్ ద్వారా వారి టాలెంట్‌ను నిరూపించుకోవడానికి ప్రయత్నించేవారు. కానీ ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్‌కు క్రేజ్ తగ్గిపోయింది. వాటిచోటిలో వెబ్ సిరీస్‌లు ట్రెండ్ అవుతున్నాయి. కానీ రెండేళ్ల క్రితం విడుదలయిన ఒక తెలుగు షార్ట్ ఫిల్మ్ మాత్రం ఇప్పటికీ అవార్డుల పంట పండిస్తోంది.

దీపక్ రెడ్డి తెరకెక్కించిన 'మనసానమహా' అనే షార్ట్ ఫిల్మ్ విడుదలయ్యి ఇప్పటికీ రెండేళ్లు అయ్యింది. ఈ షార్ట్ ఫిల్మ్.. ఒక ప్రేమకథ ఆధారంగా తెరకెక్కిందే అయినా.. ఆ కథ మొత్తం రివర్స్‌లో చెప్తారు. ఇప్పటివరకు తెలుగులోనే కాదు.. ఇంకే భాషలో కూడా ఈ కాన్సెప్ట్‌తో, ఈ విధంగా షార్ట్ ఫిల్మ్ తెరకెక్కలేదు. దీంతో ఎన్నో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో కూడా మనసానమహా స్క్రీనింగ్ జరిగింది. అలాగే దాదాపు 513 అవార్డులను సొంతం చేసుకుంది ఈ షార్ట్ ఫిల్మ్.

ఇటీవల మనసానమహా షార్ట్ ఫిల్మ్‌కు గిన్నీస్ బుక్‌లో కూడా చోటు దక్కింది. ఈ విషయాన్ని దర్శకుడు దీపక్ రెడ్డి స్వయంగా తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్‌లోని టాప్ డైరెక్టర్ల దృష్టి తనపై పడింది. ఎంతోమంది తనను అభినందించారు. ఇక ఇదే కథతో ఓ ఫీచర్ ఫిల్మ్‌ను తెరకెక్కించాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టాడు దీపక్. మనసానమహాలో హీరోగా నటించిన విరాజ్ అశ్విన్.. ప్రస్తుతం సినిమాల్లో బిజీ అయిపోయాడు కూడా.

Full View


Tags:    

Similar News