Lakshmi Manchu: మంచు లక్ష్మి దాతృత్వం.. 50 స్కూళ్లను దత్తత..
Lakshmi Manchu: సినీనటి మంచు లక్ష్మి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు.;
Lakshmi Manchu: సినీనటి మంచు లక్ష్మి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని 50 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని మంచు లక్ష్మి కలిసి అగ్రిమెంట్ పేపర్లపై సైన్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధిచేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు 450 పాఠశాల్లో ఒక గంట పాటు డిజిటల్ క్లాసులను నిర్వహిస్తున్నామన్నారు మంచు లక్ష్మి. అలాగే దేశవ్యాప్తంగా 30వేల మంది పిల్లలకు విద్యను అందిస్తున్నామని మంచు లక్ష్మి తెలిపారు.