Manchu Lakshmi: కూతురి విషయంలో కన్నీరు పెట్టుకున్న మంచు లక్ష్మి..
Manchu Lakshmi: మంచు లక్ష్మికి ఒకత్తే కూతురు. తనే విద్యా నిర్వాణ.;
Manchu Lakshmi: మోహన్ బాబు ఫ్యామిలీకి టాలీవుడ్‌లో ఎంతో పాపులారిటీ ఉంది. వీరి ఫ్యామిలీలో అందరూ సినీ పరిశ్రమకే పరిమితమయ్యి ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక మంచు లక్ష్మి కూడా నటిగా పలు సినిమాలతో మెప్పించింది. అంతే కాకుండా నిర్మాతగా కూడా పలు చిత్రాలను తెరకెక్కించింది. ఇటీవల తన కూతురు విద్యా నిర్వాణ విషయంలో మంచు లక్ష్మి కన్నీరు పెట్టుకుంది.
మంచు లక్ష్మికి ఒకత్తే కూతురు. తనే విద్యా నిర్వాణ. విద్యా పుట్టినప్పటి నుండి తన గురించి నెటిజన్లకు తెలిసేలా ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ వచ్చింది మంచు లక్ష్మి. అంతే కాకుండా తన కూతురు పాటలు పాడినా, డ్యాన్స్ చేసినా.. వెంటనే వాటిని వీడియోలు తీసి అందరితో షేర్ చేసుకుంటుంది. ఇక వీరి బాండింగ్ చూస్తుంటే.. తల్లీకూతుళ్లలాగా కాకుండా ఫ్రెండ్స్‌లాగా ఉంటారు అనుకుంటూ ఉంటారు కొందరు నెటిజన్లు.
రెండు సంవత్సరాల తర్వాత విద్యా ఈరోజు స్కూలుకు వెళ్లింది. ఇదే విషయమై మంచు లక్ష్మి ఎమోషనల్ అయ్యింది. 'కోవిడ్ వల్ల స్కూళ్లు మూతబడి రెండేళ్ల నుండి విద్యా ఇంట్లోనే ఉంది. దీంతో మా మధ్య ప్రేమ మరింత పెరిగింది. అందుకే చాలారోజుల తర్వాత తనను స్కూలుకు పంపించి వస్తుంటే ఏదో తెలియని బాధ. త్వరలోనే దీనికి అలవాటు పడతానని అనుకుంటున్నాను' అని మంచు లక్ష్మి కన్నీరు పెట్టుకుంది.
First day of school after the pandemic. @VidyaNirvana was homeschooled for two years and now I let her go into the real world and let her find her adventures (as I'm kicking and crying to do the same). Go fly my beautiful,sweet,kind child. pic.twitter.com/F5Rlu2h3so
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) July 25, 2022